పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌

పోలీసుల

మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు. త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌ (31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు. జూన్ 19వ తేదీ సాయంత్రం 8.15 వ‌ర‌కు షాపు తెరిచే ఉంచ‌డంతో పెట్రోలింగ్ పోలీసు ఫెనిక్స్‌‌ను బ‌య‌ట‌కు లాగాడు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య‌ వివాదం జ‌రిగింది. ఆ మ‌ర్నాడు షాపుకు వ‌చ్చిన పోలీసులు ఫెనిక్స్‌ తండ్రి జ‌య‌రాజ్‌తో వాద‌న‌కు దిగారు. అత‌డిని స్టేష‌న్‌కి తీసుకెళ్లారు. విష‌యం తెలుసుకున్న ఫెనిక్స్ పోలీస్ స్టేష‌న్‌కి ప‌రుగుపెట్టాడు. అక్క‌డే అత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్ద‌రిపై ఐపీసీ 188 (ప్ర‌భుత్వ అధికారి ఆదేశాల‌ను బేకాత‌రు చేయ‌డం), 353 (ప్ర‌భుత్వ అధికారి విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం), 269 (ప్ర‌మాద‌క‌ర వ్యాది సంక్ర‌మ‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం), 506(2) బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం లాంటి సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. పోలీసు క‌స్ట‌డీలో జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌‌ల‌ను పోలీసులు తీవ్రంగా హింసించారు.

ʹపోలీస్ స్టేష‌న్‌లో జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల‌ను పోలీసులు చిత్ర‌హింస‌లు పెడుతుండ‌డం మేము బ‌య‌ట నుంచి అద్దాల ద్వారా చూస్తూనే ఉన్నాం. ఆగ్ర‌హంతో కూడిన‌ పోలీసుల అరుపుల‌తో పాటు, జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల రోద‌న‌లు మాకు వినిపిస్తున్నాయి. ఉద‌యానికి క‌ల్లా వారిని ఉంచిన ప్రాంతమంతా నెత్తుటిమ‌య‌మైంది. తెల్ల‌వారు జామున జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌లను జీపులో వేసుకొని మెజిస్ట్రేట్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ వాళ్లు అరోగ్యంగా ఉన్నారా లేరా? వాళ్ల‌కేమైనా గాయాల‌య్యాయా అని తెలుసుకోకుండానే జుడిషియ‌ల్ క‌స్ట‌డీకి ఆదేశించారʹ‌ని ఫెనిక్స్ కోసం పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిన అత‌ని న్యాయ‌వాది మ‌ణిమార‌న్ వెల్ల‌డించాడు.

మాట‌ల్లో చెప్ప‌లేనంత హింస‌ను వాళ్లు అనుభ‌వించార‌ని మార‌న్ మాటలు వింటే అర్థ‌మ‌వుతుంది. ʹపోలీసులు తెలివిగా జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల‌ను జైలుకు పంపి చేతులు దులుపుకోవాల‌నుకున్నారు. జైలులో వాళ్ల బ‌ట్ట‌లు పూర్తిగా నెత్తుటిలో త‌డిసిపోయాయి. వాళ్ల‌కు వేరే బ‌ట్ట‌లు తెచ్చిచ్చాను. ఫెనిక్స్ నిల‌బ‌డ‌లేని స్థితిలో ఉన్నాడు. ఫెనిక్స్ వెన‌క నుంచి లాఠీని దూర్చ‌డంతో తీవ్రంగా అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావం జ‌రిగిందిʹ అని చెప్పుకొచ్చాడు. జ‌య‌రాజ్‌, ఫెనిక్స్‌ల పురుషాంగం నుంచి నెత్తురు కార‌డాన్ని చూసిన‌ట్లు మ‌రికొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు.

కోవిల్ ప‌ట్టి స‌బ్ జైలులో వారిద్ద‌రినీ ప‌రీక్షించిన వైద్యుడు వాళ్ల ఆరోగ్య ప‌రిస్థితి బాగాలేద‌ని, వాళ్ల శ‌రీర ప్రైవేటు బాగాల్లో తీవ్రమైన గాయాలున్నాయ‌ని రిపోర్టు ఇచ్చారు. వాళ్ల‌కు ఎక్స్‌రే తీయాల్సిన అవ‌స‌రముంద‌ని 20వ తేదీ జైలు అధికారుల‌కు తెలియ‌జేశాడు. 21వ తేదీ నాటికి జ‌య‌రాజ్, ఫెనిక్స్ తీవ్రంగా అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో వారిని కోవిల్‌ప‌ట్టి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 22వ తేదీ సాయంత్రం ఆసుప‌త్రిలో ఫెనిక్స్‌ మృతి చెంద‌గా, మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌య‌రాజ్ మృతిచెందాడు.

లాక్‌డౌన్ సాకుతో లాఠీ‌ పాల‌న‌కు తెర‌తీసిన పాల‌క వ‌ర్గాలు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి త‌మ అధికారాన్ని కాపాడుకోవాల‌నుకుంటున్నాయి. లాక్‌డౌన్ పేరుతో... ప్ర‌జ‌ల ప్ర‌శ్నించే హ‌క్కును సైతం తొక్కిపెట్టి నియంతృత్వాన్ని చ‌లాయిస్తున్నాయి. పోలీసుల‌కు విచ్ఛ‌ల‌విడి అధికారులు ఇచ్చి... నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిని కొట్టి చంప‌డం స‌రైందే అనే ప్ర‌చారాన్ని లంఘించాయి. ఇంకేముంది... అధికారాన్ని ప్ర‌శ్నించ‌నంత‌కాలం జార్జి ఫ్లాయిడ్‌, జ‌య‌రాజ్‌, ఫెనిక్స్ ఇలా ఒక్కొక్క‌రుగా ప్రాణాలు కోల్పోవ‌ల్సిందే.
- క్రాంతి

Keywords : tamilanadu, police, lockup death, JusticeForJayarajAndFennix,
(2024-05-21 09:53:48)



No. of visitors : 2388

Suggested Posts


కరోనా కన్నా కులమే ప్రమాదకర‌ వైరస్...పా రంజిత్

కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.

ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !

చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు.

వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌

నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం...

కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య‌!

"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన. కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట

కేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పోలీసుల